telugu navyamedia
సామాజిక

తుల‌సితో అదృష్టం..

సాధార‌ణంగా ఇంటి ఆవ‌ర‌ణ‌లో చాలా మంది మొక్క‌లు పెంచుకోవడానికి ఆస‌క్తి చూపుతున్నారు. ఇంట్లో మొక్కలు పెంచుకుంటే స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు ఆ మొక్కలకు పూచే పువ్వులు ఇచ్చే సుగంధం మన ఇంటికి ఆకర్షణను తీసుకువస్తుంది. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఇష్ట‌ప‌డే వారు మొక్క‌లు పెంచ‌డానికి మ‌క్కువ చూపుతారు.

సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయంటారు. ముఖ్యంగా ఈశాన్యంలో ఖాళీ స్థానం ఉంటే కొన్ని మొక్క‌లు వాస్తు ప్ర‌కారం నాటితే ఎంతో అదృష్ట‌మ‌ని తెస్తుంద‌ని, ఈ మొక్క‌ను నాటితే ల‌క్ష్మీ అనుగ్ర‌హాం క‌లుగుతుంద‌ని పండితులు చెబుతుంటారు.

Importance of Tulsi in Hinduism | Vedic Upasana Peeth

అందులో తుల‌సి ప్ర‌ధాన‌మైన‌ది..ప‌విత్ర‌మైన‌ది..తెలుగు వాళ్ళు ఎక్కువ‌గా పూజింజిన మొక్క‌గా ప్ర‌సిద్ధి. తులసి ఆకులను ప్రత్యేకించి దేవతార్చనలో వాడుతారు. క‌లియుగ వైకుంఠ వెంక‌టేశ్వ‌ర స్వామికి తులసి ద‌ళాలుతో పూజ‌లు చేస్తారు. తుల‌సి పూజికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాంటి ఈ తుల‌సి ఎక్క‌డ నాటితే మంచిది తెలుసుకుందాం..

One crore tulasi leaves offered to Lord Krishna | Deccan Herald

తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నేలమీద నాటకూడదు. పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి. ఉత్తర ద్వారం ఇంటికి వాయవ్యంలో తులసికోట వుండాలి. ఈశాన్యంలో, తూర్పులో, ఉత్తరాన తులసికోట కట్టకూడదు. ఈ దిశల్లో కుండీల్లో కూడా తులసిని పెట్టరాదు.

Tulsi Plant at Home: What is the Best Tulsi Plant direction According to  Vastu Shastra

ఈ విధానం ప్రకారం తులసిని ఇంటి ఆవ‌ర‌ణ‌లో నాటుకుని చుట్టూ ప్రదక్షిణ వచ్చేలా చేసుకోవడం శ్రేయస్కరం. పూర్వకాలములో తులసి బాగుంటే ఇంటిలో కీడు జరగదని, తులసి వాడిపోయి, రాలిపోతే ఇంటిలో కీడు జరగడానికి అవకాశం ఉందని పెద్ద‌లు నమ్మేవారు.

Related posts