మస్తిష్కం మెరవడానికి
మనసు మురవడానికి
పుస్తక పఠనం అత్యవసరం!
పుస్తకాలు .. ప్రియ నేస్తాలు
ప్రయాణంలో దోస్తులు
జీవితసత్య జ్ఞాన దీపికలు
జీవనగమన దిక్సూచీలూ
పురోగమన సోపానాలు
ప్రశాంత జీవన మార్గాలు
ఆహ్లాద జీవన ఆవశ్యకాలు
అజ్ఞాన తిమిర వినాశకాలు
ఆధ్యాత్మిక వేదికలు
సంఘజీవన సూచికలు
సంస్కార దీపికలు
విలువల వెలుగులు !
జీవన సారం తెలిపే.. తాత్విక శ్రేష్ఠులు
మోక్షమార్గం చూపే.. ముక్తి ప్రదాతలు
జ్ఞాన బోధ చేసే.. గురుపుంగవులు
పరమార్ధం తెలిపే.. ప్రవచన కర్తలు!
అజ్ఞాన సంద్రపు అలలు దాటి…
జ్ఞాన తీరాలు చేర్చే నావలు!
నిరక్షరాస్యత నిశీధుల్లో…
నింగిని వెలిగించే దీప శిఖలు !
భౌతిక భ్రమల సునామీనుండి…
బయట పడేసే నావికులు!
మాయాగ్నికీలలనుండి కాపాడి…
ముక్తిమార్గంచూపే దార్శనికులు!
ఆత్మజ్ఞానమిచ్చే ఆచార్య దేవుళ్లు!
సాంప్రదాయ సమాహారాల్ని
సంస్కృతీ సంపదను
చారిత్రక వాస్తవాలను
జ్ఞాన భాండాగారాలను
విజ్ఞాన ధనాగారాలను
తరంనుండి తరానికి.. తరలించే…
అలుపెరుగని వాహనాలు!
ఆస్తులున్నా లేకున్నా
ఆప్తులున్నా లేకున్నా
మిత్రులున్నాలేకున్నా
పుస్తకాలంటే చాలు…
ప్రశాంతత కలుగుతుంది!
పుస్తకాలు పట్టుకుందాం …!
ప్రశాంతంగా బ్రతుకుదాం!
దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు: విజయసాయిరెడ్డి