telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

పక్కా ప్లాన్ ప్రకారమే నాపై దాడి: డాక్టర్ సుధాకర్

Dr Sudhakar

పక్కా ప్లాన్ ప్రకారమే నాపై దాడి జరిగిందని ర్సీపట్నం డాక్టర్ సుధాకర్ చెప్పారు. విశాఖపట్టణం నాలుగవ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న తన కారును తీసుకునేందుకు డాక్టర్ సుధాకర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని మోదీ, చంద్రబాబు, జగన్ అందరూ బాగానే పాలించారని అన్నారు. ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. పేదల కోసం సీఎం జగన్ మంచి పనులే చేస్తున్నారని అన్నారు.

తాను సస్పెండ్ అయినప్పటి నుంచి తనకు దారుణమైన ఫోన్ కాల్స్ వచ్చాయని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా తాను భయపడ్డానని చెప్పారు. బ్యాంక్ పని కోసం తప్పనిసరిగా నక్కపల్లి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. తాను వెళ్తుండగా తనను కొందరు ఫాలో అవుతుండటంతో కారును ఆపానని తెలిపారు. కారు దిగిన తర్వాత తనపై దాడి జరిగిందని వెల్లడించారు. తప్పుడు పనులు చేస్తున్నట్టు పోలీసులకు తనపై ఫిర్యాదు చేశారని అన్నారు.

తనపై పిచ్చోడి ముద్ర వేసి, ఉద్యోగాన్ని తీయించాలనే కుట్ర చేశారని సుధాకర్ చెప్పారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన తప్పని పేర్కొన్నారు. ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకు తనను వాడుకున్నారని అన్నారు. తనకు గుండు గీసిందెవరో చెపితే మళ్లీ గొడవ అవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతున్నానని అన్నారు.

Related posts