telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

హనుమంతుని సింధూరం ఎందుకు ఉంటుంది? ప్రతీ హిందువు తెలుసుకోవాల్సిన విషయాలు!

ఒంటి మీద సింధూరం వర్ణం లేని హనుమంతున్ని విగ్రహం అరుదు. ఇంతకి ఆంజనేయుడు సింధురపు రంగులో ఎందుకు ఉంటాడు! అనే సందేహం వెనుక ఓక ఆదర్శవంతమైన కథ ఉంది..అదేమిటంటే

ఓక రోజు హనుమంతుల వారు శ్రీరాముని అంతఃపురం లోకి ప్రవేశించాడు..అలా ప్రవేశించే సమయంలో సీతమ్మ తన పాపిట సింధురాన్నీ అద్దుకోవడం గమనించాడు ఆంజనేయుడు…సీతమ్మ వారు అలా పాపిట సింధురాన్నీ అలముకోవడం చూసి ఆయనకు భలే ఆశ్చరయం వేసింది….

సీతమ్మ చెంతకు అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మా మీరు నుదుటిన ఆ సింధురాన్నీ ఎందుకు ధరిస్తున్నారు అని అడిగాడు..హనుమా! నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజు సింధురాన్నీ ధరిస్తాను పైగా ఇలా పాపిట సింధురాన్నీ ధరించడం వల్ల ఆయనా దీర్ఘాయుష్షులుగా ఉంటారన్నది నా నమ్మకం! అంటూ చిరు నవ్వుతో సెలవిచ్చింది జానకి..

సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోశానికి

అవధులు లేకుండా పోయాయి…సీతమ్మ పాపిట వెనుక తన స్వామి శ్రేయస్సు,సంతోషం ఉన్నాయా?అనుకొని మురిసిపోయాడు…వెంటనే ఆయన మనసులో ఓక ఉపాయం మెదిలింది..ఈ కాస్త సింధురాన్నీ ధరిస్తేనే స్వామి వారి ఆయుష్షు పెరుగుతుంది అంటే…మరి ఒంటి నిండా సింధురాన్నీ ధరిస్తే తిరుగేముంది అనుకున్నాడు…అనుకున్నదే ఆలస్యం తన ఒంటి నిండా నూనె కలిపిన సింధురాన్నీ ధరించాడు…

శిరస్సు నుంచి పాదాల వరకు మెరిసిపోతున్న ఆంజనేయుడు…నేరుగా రాముని దర్భారులో ప్రవేశించాడు..ఆ స్థితిలో హనుమంతున్ని చుసిన రాముడు ఆశ్చర్యానికి అవదులు లేకపోయాయి..

ఏంటి హనుమా! ఒంటి నిండా ఏమిటి ఆ రంగు’ అని చిరునవ్వుతో అడిగాడు…

స్వామీ సీతమ్మ తన పాపిట సింధూరం దరిస్తే మీకు సంతోషమూ, ఆయుష్షు వృద్ది చెందుతాయని సెలవిచ్చారు….మరి నేను ఒంటినిండా సింధూరాన్ని అలముకుంటే మరెంత కలుగుతుందోకదా అందుకనే ఇలా…’అంటూ చెప్పుకొచ్చాడు…

హనుమంతునికి తన మనస్సులో తన పట్ల ఉన్న ఆరాదనని గమనించిన రాముని సంతోషానికి అవదులు లేకుండా పోయాయి…హనుమ నువ్వు నా భక్తులందరికీ మరొక సారీ ఆదర్శంగా నిలిచావు..

ఇక మీదట నీ సింధురాన్నీ ఎవరైతే ధరిస్తారో…వాళ్లు నీ అనుగ్రహానికే కాదు , నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు ‘ అంటూ ఆశీర్వదించారు…

అదిగో అప్పటి నుంచీ హనుమంతుల వారు నిత్యం సింధూర వర్ణంలో మెరిసిపోవడం , ఆయన సింధూరాన్ని మనమూ కాస్త నుదిటిన అద్దుకోవడం ఆనవాయితీగా వస్తోంది…ఆయన అనుగ్రహమూ భక్తులకు లభిస్తుంది..

 

 

Related posts