telugu navyamedia
సినిమా వార్తలు

పవర్ ఫుల్ పాత్రలో గ్లామర్ డాల్

Jhansi

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ డాల్ గా రాయ్ లక్ష్మి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ నటిగా నిరూపించుకోవడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. “జూలి-2” అంటూ బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడా నిరాశ తప్పలేదు రాయ్ లక్ష్మీకి. తెలుగులో ప‌వ‌న్‌, చిరు చిత్రాల‌లో ఐటెం సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. రాయ్ ల‌క్ష్మీ కొన్నాళ్ళుగా గ్లామ‌ర్ రోల్స్‌లో అల‌రిస్తూనే క‌థానాయిక ప్ర‌ధాన్యం ఉన్న చిత్రాలు చేస్తుంది. ఇందులో భాగంగా “వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ”, “నాగ కన్య” వంటి చిత్రాలతో ఇటీవలే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన రాయ్ లక్ష్మీ ఇప్పుడు “ఝాన్సీ” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధ‌మైంది. ఇందులో ఆమె పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్ర పోషిస్తుంది. గురు ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ భవాని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ కుమార్ నిర్మిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితం రాయ్ లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో చాలా ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో క‌నిపిస్తుంది రాయ్‌. కాగా ఈ మూవీ ట్రైలర్ ఈనెల 11న విడుదల చేయనున్నారట.

Related posts