telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పార్కులో రొమాన్స్ చేసుకుంటున్న చైతు, రాశిఖన్నా

అక్కినేని హీరో నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథగా రూపొందింది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట ప్రోమోలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఆకర్షించాయి. ఇది ఇలా ఉండగా.. చైతూ ప్రస్తుతం థాంక్యూ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని దిల్‌రాజ్‌నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హాకీ ఆటగాడిగా చైతూ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో రాశీఖన్నా, ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయిర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..  తాజాగా ఇటలీ షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఓ పార్కులో కూర్చున్న చైతన్యను రాశిఖన్నా వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

Related posts