telugu navyamedia
సినిమా వార్తలు

స‌ల్మాన్ దయా హృద‌యం గ‌ల వ్య‌క్తి… ఆయన వల్లే కోలుకుంటున్నాను… : దాది పాండే

Dabang-3

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా “దబాంగ్-3” చిత్రం తెరకెక్కుతోంది. సోనాక్షి సిన్హా ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రం చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ “భారత్” సినిమా షెడ్యూల్‌తో సల్మాన్ బిజీ అవ్వడంతో “దబాంగ్-3” షూటింగ్‌కు బ్రేక్ పడింది. తాజాగా “దబాంగ్-3” చిత్రం మళ్లీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇందులో పాండే కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పాండేకి గుండెపోటు వచ్చింది. “దబాంగ్-3” సెట్స్ లో ఈ ఘటన జరగనప్పటికీ ఆయన బాగోగులు చూసుకోవాలని సల్మాన్ తన మనుషులను పంపించారు. గొరెగావ్ లోని ఆసుపత్రికి పాండేను తరలించారు. జూలైలో ద‌బాంగ్ 3 న‌టుడు దాది పాండేకి గుండెపోటు రావ‌డంతో ఆయ‌న ఆసుప‌త్రి ఖ‌ర్చు అంతా స‌ల్మాన్ భ‌రించాడ‌ట‌. ఈ విష‌యాన్ని దాది పాండే తెలియ‌జేశాడు. “స‌ల్మాన్ చాలా దయా హృద‌యం గ‌ల వ్య‌క్తి. అత‌ను చాలా గొప్ప వ్య‌క్తి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ది. స‌ల్మాన్ వ‌ల‌న‌నే నేను కోలుకోగ‌లుగుతున్నాను” అని పేర్కొన్నాడు ద‌బాంగ్-3 న‌టుడు. “ద‌బాంగ్-3” చిత్రంలో దాది పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. 2010లో స‌ల్మాన్ హీరోగా తెర‌కెక్కిన ద‌బాంగ్‌లోను దాది న‌టించాడు. రెండు నెల‌ల నుండి షూటింగ్‌కి దూరంగా ఉన్న ఆయ‌న అతి త్వ‌ర‌లోనే టీంతో క‌ల‌వ‌నున్నాడు. దబాంగ్ ఫ్రాంచైజీలో మూడో పార్ట్‌గా వ‌స్తున్న “ద‌బాంగ్-3” చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts