telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్లిపై శృతి హాసన్ స్పందన

Shruti-Hassan

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది శృతి హాసన్. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త‌మిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగులో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని చిత్రంలో కూడా హీరోయిన్‌గా శృతి పేరే బ‌లంగా విన‌ప‌డుతుంది. మరోవైపు అమెరికాకు చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్ “టెడ్‌స్టోన్‌”లో నటించే అవకాశం దక్కింది ఈ బ్యూటీ. ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత కెరీర్ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది. దీంతో ఆమెకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. తాజాగా ఓ అభిమాని ట్విట‌ర్ ద్వారా శృతిని పెళ్లి గురించి ప్ర‌శ్నించాడు. “శృతి.. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు? అభిమానులంద‌రం మీ పెళ్లికి వ‌స్తాం. మీ వీరాభిమానుల‌ను ప్ర‌త్యేకంగా మీ పెళ్లికి ఆహ్వానించండి” అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు శృతి స్పందిస్తూ.. “పెళ్లి కోసం అయితే మీరు చాలా కాలం వెయిట్ చేయాలి. దానికి బ‌దులుగా మ‌నంద‌రం జ‌న్మ‌దినోత్స‌వాన్ని క‌లిసి జ‌రుపుకుందాం” అని సమాధానం ఇచ్చింది.

Related posts