telugu navyamedia
సినిమా వార్తలు

సినిమా టికెట్ల రేట్ల ఇష్యూ : చిరంజీవి గారిని ఒక్క‌రి పిల‌వ‌డం స‌రికాదు..

*సీఎం జ‌గ‌న్‌తో చిరంజీతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు భేటి..
*అంద‌రినీ పిలిస్తే ఇండస్ర్టీలోనూ విభేదాలు ఉండ‌వు..
* ఫిల్మ్ ఛాంబ‌ర్‌, ఫ్రొడ్యూస‌ర్ కౌన్సిల్ లేకుండా
* సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌
* కంటెంట్ ఊంటేనే మూవీ ఆడుతుంది..

ఏపీలో సినిమా సమస్యలపై సీఎం జగన్‌తో రేపు చిరంజీవి భేటీ కానున్నారు. రేపు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు  చిరంజీవితో పాటు నాగార్జున‌, మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్,  నిర్మాత దిల్‌రాజు తో పాటు మరికొందరు తెలుగు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు.

ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే రెండు సార్లు మంత్రి పేర్ని సీఎం జగన్‌ను కలిసి వివరించారు. సినిమా టికెట్ల పై ప్రభుత్వ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిపై సీఎం జగన్ సినీ ప్రముఖులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అయితే నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్పందిస్తూ.. చిరంజీవి గారిని ఒక్క‌రి పిల‌వ‌డం స‌రికాదని అన్నారు.. అంద‌రినీ పిలిస్తే ఇండస్ర్టీలోనూ విభేదాలు ఉండ‌వు అని అన్నారు. చిరంజీవి తమ నాయకుడే అని ..కానీ ఫిల్మ్ ఛాంబ‌ర్‌, ఫ్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను పిలిపించి మాట్లాడాలని ముఖ్యమంత్రి జగన్ కు తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

10TV Telugu News

ఆన్ లైన్ టికెటింగ్ విధానమంటూ వస్తే.. దోపిడీ అడ్డగోలుగా పెరుగుతుందని తమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ డిఎస్‌ తో కలిపి.. ఈ విధానాన్ని అమలు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఆంధ్రాలో లొకేషన్ చార్జీలు తీసుకోవడం లేదని.. తెలంగాణలోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేప‌థ్యంలో  సీఎం జ‌గ‌న్‌తో చిరంజీవి భేటి కీల‌కంగా మారింది.

Related posts