telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్‌ రికార్డులను బద్దలు కొడుతున్న ఎన్టీఆర్‌ “భీమ్‌ టీజర్‌”

రాజమౌళి తెరకెక్కిస్తున్నా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 75 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. వీరిద్దరి వేరువేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు. అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ను అక్టోబర్‌ 22న కొమురం భీం జయంతి సందర్భంగా రాజమౌళి విడుదల చేశారు. ఈ టీజర్ లో కొమురం భీంగా ఎన్టీఆర్ ఇరగదీసాడు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ టీజర్ ను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేశారు. అయితే…రిలీజ్‌ అయినప్పటి నుంచి ఈ టీజర్‌ ఖాతాలో చాలా రికార్డులను సృష్టిస్తోంది. అయితే.. తాజాగా ఈ టీజర్‌ మరో రికార్డును క్రియేట్‌ చేసింది. గడిచిన 24 గంటల్లో 941k లైక్స్‌, 14.2M వ్యూస్‌తో ఆల్‌ టైం రికార్డును సృష్టించింది ఎన్టీఆర్‌ టీజర్‌. ఈ రికార్డును టాలీవుడ్‌ ఏ సినిమా కూడా ఇప్పటి వరకు నమోదు చేయలేదు. మొదటి సారిగా ఎన్టీఆర్‌ టీజర్‌ మాత్రమే ఈ రికార్డును క్రియేట్‌ చేసింది.

Related posts