telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఫలితాల పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం : ఎల్.జి.పి అధినేత

బీహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ గెలిచిన విషయం తెలిసిందే. ఎంతో పోటీ ఇచ్చినప్పటికీ ఆర్‌జేడీ బీహార్ సీఎం పదవిని సొంతం చేసుకోలేక పోయింది. మొత్తం 243 స్థానాలకుజరిగిన ఎన్నికల్లో 125 స్థానాలు గెల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అందులోనూ బీజేపీ తన సొంతంగా 72 సీట్లను గెలిచింది. ఇక ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాఘట్‌ బంధన్‌ 110 స్థానాలు సాధించింది. తొలిసారిగా ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో గెలవగా సీపీఐ ఎంఎల్‌ 12, సీపీఎం,సీపీఐ చెరో రెండుస్థానాలు, ఎల్జేజీ ఒక్కస్థానంలో నిలిచింది. మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడంతో కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. అయితే వెలువడిన ఫలితాల పై ఎల్.జి.పి అధినేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. వచ్చిన ఫలితాల పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. మా ఓట్ బ్యాంక్ 3 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. ఒక సీటు కూడా సాధించాం. అలాగే జేడీయూను ఓడించాలనే మా రెండో లక్ష్యంలో సక్సెస్ అయ్యాం అని పేర్కొన్నారు. ఇక నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిగా అంగీకరించటం మినహా మా ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. నితీష్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ప్రతిపక్ష గళాన్ని వినిపిస్తాం అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు.

Related posts