telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : కెప్టెన్సీ టాస్క్ రద్దు… అర్ధరాత్రి సూట్‌కేసులు సర్దుకున్న ఇంటి సభ్యులు

Bigg-Boss

బిగ్ బాస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం బాస్కెట్ బాల్స్‌ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవ‌రి బంతిని వాళ్లే కాకుండా మిగ‌తావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు ఆల‌స్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవ‌రి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖ‌రి రౌండ్‌లో గోల్ చేసిన బంతి మీద ఎవ‌రి ముఖం ఉంటే వాళ్లే గెలిచిన‌ట్లు. ఈ గేమ్‌లో అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు. అత‌డు, హారిక క‌లిసి త‌న‌కు గిట్ట‌ని వ్య‌క్తి ముఖం ఉన్న బంతిని తీసుకుని కావాల‌ని ఆల‌స్యంగా వేశారు. మోనాల్ బంతిని ఎవ‌రూ తీసుకోలేదు. ఈ గేమ్‌లో చివ‌రికి మెహ‌బూబ్‌, అఖిల్ ఇద్ద‌రే మిగిలారు. ఈసారి నాకు స‌పోర్ట్ కావాలంటే నాకు స‌పోర్ట్ కావాలని ఇద్ద‌రూ వాదులాడుకున్నారు. బ‌జ‌ర్ మోగిన విష‌యం మ‌ర్చిపోయి బాల్ వేయ‌కుండా కీచులాడుతూనే ఉన్నారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బిగ్‌బాస్ బాధ్య‌తారాహిత్యం కార‌ణంగా ఈ టాస్క్ ర‌ద్దు చేస్తున‌ట్లు వెల్ల‌డించారు. ఈ వారానికి హౌస్‌లో కెప్టెనే ఉండ‌ర‌ని ప్ర‌క‌టించాడు. దీంతో స్నేహితుల కోసం గేమ్ నుంచి త‌ప్పుకున్న‌ సోహైల్ చిందులు తొక్కాడు. వీళ్ల పంచాయితీ మీద‌ అభిజిత్ సెటైర్లు వేశాడు. ఎందుకింత అగ్లీగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు, మంచిగా ఆడొచ్చు క‌దా అని త‌న టీమ్‌తో చ‌ర్చించాడు. కానీ మ‌రుక్ష‌ణ‌మే అత‌డు హగ్ టాపిక్‌కు తెర తీశాడు. పోయి హ‌గ్గులిచ్చుకో పో అని హారిక మీద కోప్ప‌డ్డాడు. నాకు హ‌గ్గిచ్చి ఎన్ని రోజులైతుందో తెలుసా? అని అభి అలగ‌డంతో ఈరోజు పొద్దున్నే క‌దా ఇచ్చాన‌ని హారిక జ‌వాబిచ్చింది. అయినా ఇప్పటికిప్పుడు నేను హ‌గ్గిస్తే కుర్చీలో నుంచి కింద ప‌డిపోతావు అని హెచ్చ‌రించింది. ఎప్పుడూ ఏదో అని, దాన్ని క‌వ‌ర్ చేసేందుకు హ‌గ్గిచ్చావే కానీ సొంతంగా హ‌గ్గిచ్చావా అని నిల‌దీశాడు. అలా కాసేప‌టి వ‌ర‌కు ఈ హ‌గ్గుల గురించి హ‌ద్దులు దాటి మాట్లాడుకున్నారు. ఇక అరియానా ద‌గ్గ‌ర మోనాల్ సేఫ్ గేమ్‌ ఆడుతుంద‌ని చెప్పిన అవినాష్‌.. త‌ర్వాత మాత్రం ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి టాప్ 5లో ఉంటావంటూ క్రీమ్ బిస్కెట్లు వేశాడు. అనంతరం అర్ధ‌రాత్రి ఇంటిస‌భ్యుల‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ వారి సూట్‌కేసుల‌ను స‌ర్దుకోమ‌న్నాడు. ఫినాలేకు వెళ్ల‌డానికి ఎవ‌రు అడ్డుప‌డుతార‌నుకుంటున్నారో వారి పేర్ల‌ను చెప్ప‌మ‌న్నాడు. ఎవ‌రు ఎవ‌రి పేర్ల‌ను చెప్ప‌నున్నారో రేప‌టి ఎపిసోడ్‌లో తేల‌నుంది.

Related posts