telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వచ్చే నెలలో పెళ్ళి పీటలెక్కనున్న నితిన్

Nithin

టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో నితిన్ వివాహం వచ్చే నెలలో చేసే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారట. ఇదివరకు డిసెంబర్ లో నితిన్ వివాహం అని వార్తలు వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం వచ్చే నెలలోనే నితిన్ పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తోంది. కరోనా ఎలాగూ తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదనే వివాహాన్ని ప్రీపోన్ చేసుకున్నట్టు సమాచారం. నితిన్ కు ఫిబ్రవరి 15న హైదరాబాద్ లో షాలిని అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం అనంతరం వైభవంగా చేసుకోవాలనుకున్న నితిన్ వివాహం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఏప్రిల్ 16న నిఖిల్ పెళ్లి కోసం ముహూర్తం పెట్టుకోగా కరోనా విజృంభణతో వాయిదా వేసుకున్నారు. పెళ్లి కోసం దుబాయ్ లో భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అన్ని బాగుంటే ఇప్పటికే నితిన్ ఓ ఇంటివాడు కూడా అయ్యేవాడు.

Related posts