telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అతి నిద్రకు .. ఇదే పరిష్కారం..

tips to overcome sleepers

అలసిపోయినప్పుడు ఒక కునుకు తీస్తే వచ్చే ఉత్సాహమే వేరు. కొందరిలో మాత్రం ఏమిటో తెలియదు, ఏదైనా మొదలు పెట్టగానే నిద్ర ముంచుకు వస్తుంది. తిన్న తరువాత ఎవరికైన ఆ తీసుకున్న పదార్దాన్ని బట్టి నిద్ర రావటం చాలా సహజం. కానీ కొంతమందికి అన్ని సమయాలలో నిద్ర కంటిమీదనే ఉంటుంది. అలాగని వారేమైనా నిద్ర పోకుండా పని చేశారా .. అంటే అదేమీ ఉండదు. అలాగని అది వారికి ఉన్న రోగము కాదు. దీనికి కారణం కూడా కొవ్వు అధికంగా చేరటమే అంటున్నారు నిపుణులు.

ఈ అతినిద్రకు మెదడు పొరల్లో కనురెప్పలమాటున కొవ్వు తెరలు పేరుకొని ఉండడమే కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా కనురెప్పల మాటున కొవ్వు పేరుకుని ఉండడం వలన మెదడు అలసిపోతుంది. తద్వారా అతినిద్ర ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు.

ఈ సమస్యకు పరిష్కారం కోసం.. ప్రతి రోజూ రాత్రి నేలములక వేరులు తేనెతో చాది కళ్ళకు వేసుకోవాలి. అలా చేసి నిమ్మరసం, తేనె వాడుతుంటే ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

Related posts