telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “బొమ్మ బ్లాక్ బస్టర్” టీజర్

BB

విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ “బొమ్మ బ్లాక్‌ బస్టర్” సినిమాకు రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నందు, రష్మీ గౌతమ్‌ జంటగా నటిస్తున్నారు. ఇందులో పోతురాజుగా హీరో నందు, పోతురాజు గాడి ల‌వర్ వాణిగా హీరోయిన్ రష్మీ విలక్షణ పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనుంది. తాజాగా “బొమ్మ బ్లాక్ బస్టర్” మూవీ టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. 2 నిమిషాల 6 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. ”నందు గాడి జీవితకథను పూరి రూపొందించాలి అనేదే అతగాడి నిర్ణయం” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts