telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

భారీగా బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే .. గుండెజబ్బులు రావట..!

heavy breakfast reduces chances of heart problems

రోజు ఉద‌యం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మ‌న‌కు చాలా ముఖ్య‌మైన ఆహార‌మ‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందుకే ఎవ‌రైనా స‌రే.. నిత్యం ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని.. అది కూడా చాలా ఎక్కువ‌గా తీసుకోవాల‌ని.. అందులో అన్ని పోష‌కాలు ఉండాల‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతుంటారు. అదే మ‌నం రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో ముఖ్య‌మైందిగా చెప్ప‌బ‌డుతుంది. అది ఇప్పుడు నిరూపితం కూడా అయ్యింది. బ్రేక్‌ఫాస్ట్ ను పెద్ద మొత్తంలో తీసుకుంటే గుండెకు చాలా మంచిద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తెలిసింది.

మ‌నం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేర‌కు 2వేల మంది నిత్యం తీసుకునే బ్రేక్ ఫాస్ట్, వారికి ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌లు.. త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించిన మీద‌ట సైంటిస్టులు ఈ విష‌యం తేల్చారు.

నిత్యం మ‌నం తీసుకునే ఆహారం ద్వారా ల‌భించే మొత్తం క్యాల‌రీల్లో 5వ వంతు క్యాల‌రీలు బ్రేక్‌ఫాస్ట్ ద్వారా ల‌భిస్తే మంచిద‌ని, దానితో రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇక బ్రేక్‌ఫాస్ట్ తిన‌కుండా మానేసేవారికి గుండె జ‌బ్బులు అధికంగా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని, ఆ ముప్పు బ్రేక్‌ఫాస్ట్ తినే వారి క‌న్నా తిన‌ని వారికి 15 శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక ఎవ‌రైనా సరే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ నిత్యం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందేన‌ని, మాన‌కూడ‌ద‌ని, అది కూడా అధిక మొత్తంలో బ్రేక్‌ఫాస్ట్ చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Related posts