telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“దబాంగ్-3” విడుదలను ఆపాలంటూ డిమాండ్

Dabang

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా స‌ల్మాన్‌ఖాన్ ఫిలింస్‌, అర్బాజ్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, స‌ఫ్రాన్ బ్రాడ్‌కాస్ట్ మీడియా లి. ప‌తాకాల‌పై స‌ల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది నిర్మిస్తోన్న చిత్రం `ద‌బాంగ్ 3`. ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 20న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ విడుద‌ల చేస్తుంది. అయితే ‘దబాంగ్ 3’ సినిమాపై హిందూ జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. దబాంగ్ 3 సినిమాలోని పాటతోపాటు కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని తొలగించాలని హిందూ జాగృతి సమితి డిమాండ్ చేసింది. దబాంగ్ 3 సినిమాలో పాటతోపాటు కొన్ని సన్నివేశాల్లో సాధువులను కించపర్చారని, వాటిని ఈ సినిమా నుంచి తొలగించాలని హిందూ జాగృతి సమితి సభ్యులు ముంబై సెన్సార్ బోర్డుతోపాటు మహారాష్ట్ర సర్కారుకు డిమాండ్ చేశారు. డిసెంబరు 20వతేదీన దబాంగ్ 3 సినిమా విడుదల చేయనున్నందున సాధువులను కించపర్చే సన్నివేశాలు, పాటను తొలగించాలని మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల హిందూ జాగృతి సమితి కోఆర్డినేటర్ సునీల్ ఘన్వాట్ డిమాండ్ చేశారు. ఈ సినిమా నుంచి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించకుంటే తమ హిందూ జాగృతి సమితి కార్యకర్తలు సినిమా హాళ్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తారని సునీల్ హెచ్చరించారు. ఈ సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను వెంటనే తొలగించేలా మహారాష్ట్ర హోంశాఖ అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయాలని సునీల్ డిమాండ్ చేశారు.

Related posts