“పోషకాల గని – అనారోగ్య నివారిణి” మన నేరేడుపండు. ఈ పండు పోషకాల గనిగా అనారోగ్య నివారిణిగా నేరేడు మంచి శక్తి ని అందించి మేలు చేయటమే కాదు అనేక రోగాలను నియంత్రించే శక్తి కలిగిన పండుగా ఆయుర్వేద వైద్యుల మన్ననలు అందుకుంది. 14 సంవత్సరాల వనవాస జీవితంలో రాముడు ఎక్కువగా నేరేడు పండ్లు తిన్నాడు అని భారతీయుల విశ్వాసం.
నేరేడు పండ్లు ప్రయోజనాలు…..
1. ఎర్రరక్త కణాలు వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉండ టానికి నేరేడుపండు ఉపయోగ పడుతుంది అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
2. ఈ పండులోని యాంటీ ఆక్సీడెంట్లు మెదడుకు, గుండెకు ఔషథంగా పని చేస్తాయి.
3. పిండి పదార్ధాలు, కొవ్వు భయం ఉండడు. అధిక బరువు, మధుమేహం ఉన్నవారికి మంచి ప్రయోజనకరం అని వైద్యులు చెబుతున్నారు.
4. మూత్ర సమస్యలు ఉన్నవారు కిడ్నీ లో రాళ్ళు ఉన్నవారు ఈ పండు తింటే ఉపశమనం కలుగుతుంది.
5. గర్భిణులకు ఈ పండు మంచిది. ఈ పండు తింటే తల్లికి, బిడ్డకి ఇద్దరికీ మంచిదని మెదడును చురుకుగా ఉంచి హార్ట్ బీట్ సరిగా ఉంచడానికి నేరేడు ఔషధంగా పనిచేస్తుంది.
6. ఈ పండు లో విటమిన్ A, C లు పుష్కలంగా ఉంటాయి. కంటి సమస్యలు, నొప్పులను నివారిస్తుంది.
7. కాల్షియమ్, పొటాషియం, ఇనుము, C విటమిన్లు అధిక మోతాదులో ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి ని ఇస్తుంది. త ద్వారా ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
8. ఈ పండు ఆకుల్ని దంచి కాషాయంగా కాచి నోట్లో వేసి పుక్కీలించాలి. దీని ద్వారా దంత, చిగుళ్ల సమస్యలు రావని చెబుతున్నారు.
9. జిగట విరోచనాలతో బాధ పడే వారు రోజుకి 2, 3 చెంచాలు నేరేడు పండ్ల రసాన్ని తీసుకుంటే రోగికి శక్తితో పాటు పేగులు కదలికలు నియంత్రణలో ఉంటాయి.
10. జ్వరం లో ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది.
11. నేరేడు పండ్ల రసాన్ని. నిమ్మరసంలో కలిపి గాయాలు ఉన్న చోట పూస్తే గాయం త్వరగా మానుతుంది. ఇది మాత్రమే కాదు దీనికి రక్తాన్ని సుద్ధి చేసే శక్తి కూడా ఉన్నది.
12. చెవులలో చీము కారటం వలన బాధ పడే వారికి ఇది మంచి మందు. దీని ఆకులు, పండ్లను దంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి రెండు చెవులలో రెండు చుక్కలు వేసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
13. వైట్ డిశ్చార్జ్ తో బాధ పడే వారు ఈ చెట్టు వేర్లను దంచి ముద్ద చేసి బియ్యం కడిగిన నీటిలో కలిపి తీసుకుంటే రక్త హీనత, వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది.
14. ఆర్ష మొలలు (పైల్స్) తో బాధ పడే వారికి నేరేడు బాగా పని చేస్తుంది. ఈ పండ్లను అవి దొరికే కాలంలో ప్రతి రోజు ఉదయం ఉప్పుతో కలిపి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది.
15. నేరేడు పండ్లలో అతి తక్కువ గలసీమిక్ ఇండెక్స్ ఉండటం వలన ఇవి డయాబెటిక్ ఉన్న వారికి చాలా మంచిది. ఐతే ఇన్ని మంచి గుణాలు ఉన్న ఈ పండును ఎక్కువగా తింటే గొంతు పట్టేసే అవకాశం కూడా ఉన్నది. అందువలన వీటిని నెమ్మది నెమ్మదిగా తినవలెను.
నేరేడుపండు మాత్రమే కాదు నేరేడు చెట్టు ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సఅలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం, వంటివి నేరేడు లో పుష్కలంగా ఉన్నాయి. ఎన్నో ఔషథ గుణాలు కలిగిన కలిగిన చెట్టు మన నేరేడు. అనారోగ్యానికి పలు విధాలుగా నేరేడు ఉపకరిస్తుంది. అందుకే ఆరోగ్య ప్రదాయనిగా వ్యవహరిస్తారు. అందుకే నేరేడు పండ్లను ఎక్కడ కనిపిస్తే అక్కడే తిన వలసినదిగా మనవి.
previous post
పార్టీల వైఖరి కారణంగానే ఫిరాయింపులు: విజయశాంతి