telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దీపావళికి “మాస్టర్” ట్రైలర్ ?

Master

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ చిత్రం “మాస్టర్”తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడి టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా, మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. కాగా దీపావళి స్పెషల్‌ గా ‘మాస్టర్’‌ సినిమా నుండి ఓ ఇంట్రస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి ‘మాస్టర్’ ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘మాస్టర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయట. ఇప్పటికే విజయ్ పార్ట్ కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసారు. తెలుగులో విజయ్ పాత్రకు హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పాడట. ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపించనున్నారు. ఇక విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’గా వచ్చి ఇక్కడ మంచి కలెక్షన్స్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది.

Related posts