telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణకు భారీ వర్షాలు… కేసీఆర్‌ కీలక ఆదేశాలు

KCR cm telangana

తెలంగాణను వర్షాలు వదలడంలేదు. ఇప్పటికే వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా పొంగిపోర్లుతున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను గమనిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ హెచ్చరించారు. వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో వర్షాలు ముంచెతుతున్నాయి. అకస్వాత్తుగా కుండపోత వానలు పడుతున్నాయి. ఆకస్మికంగా అతిభారీ వర్షం కురుస్తోంది. అయితే దీనికి కారణం క్యుములోనింబస్‌ మేఘాలే కారణమని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిజానికి వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్‌ మేఘాలు వర్షాకాలంలో పూర్తిగా తగ్గిపోవాల్సి ఉంది. కానీ..ఇప్పటికీ అవి ఆకాశంలో 800-10000 మీటర్ల ఎత్తులో అక్కడక్కడా ఆవరించే ఉన్నాయి. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అంటున్నారు.

Related posts