telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉయ్యాలవాడ కథా పాత్రల.. ధర్నా.. న్యాయం చేయాలంటూ చరణ్ ఇంటిముట్టడి..

Ram Charan images

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు రామ్ చరణ్ తేజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకున్న సమయంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కనీసం తమను కలవడం లేదని ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆ చిత్ర యూనిట్ పై ఆరోపణలు చేశారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. టైటిల్ రోల్ ను ప్రముఖ హీరో చిరంజీవి పోషిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కాగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూట్ పూర్తికాగా, ఇతరత్రా కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధం అవుతుంది.

Related posts