telugu navyamedia
రాజకీయ వార్తలు

మహిళా కార్యకర్తపై దాడికి దిగ్గిన కాంగ్రెస్ నేతలు…

ప్రస్తుతం దేశంలో కలకలం రేపింది హత్రాస్ ఘటన. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. రేపిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్, యూపీలోని డియోరియో నియోజక వర్గం లో జరుగుతున్న ఉపఎన్నికల్లో లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముకుంద్ భాస్కర్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని తారా యాదవ్ అనే కాంగ్రెస్ కార్యకర్త నాయకులను నిలదీసింది. రేపిస్టులకు టికెట్ ఎలా ఇచ్చారు ప్రశ్నించింది. దాంతో కాంగ్రెస్ నాయకులు ఆమెపై దాడికి దిగారు. రేపిస్టులకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించినందుకు తనపై నేతలు దాడి చేశారని తారాయాదవ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలనీ కోరారు. కాంగ్రెస్ మహిళా కార్యకర్త తారా యాదవ్ పై దాడి చేయడాన్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రక్షణ లేదని, జాతీయ మహిళా హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని విచారణ జరిపించాలని బీజేపీ నేతలు కోరారు. అయితే ఈ విషయం పై స్పదించిన జాతీయ మహిళా హక్కుల కమిషన్ నిందితులకు తిగిన శిక్ష పడేలా చూస్తాము అని తెలిపింది.

Related posts