telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

దర్శకుడు మారుతి చేతుల మీదుగా ‘క్షణక్షణం’ ఫస్ట్ లుక్ విడుదల…

‘ఆటకదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, జియాశర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘క్షణక్షణం’. కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు మారుతీ ఆవిష్కరించారు. డార్క్ కామెడీ జానర్ లో సాగే ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దం కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ: ‘ ‘క్షణక్షణం’ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సస్పెన్స్ , డార్క్ కామెడీ జానర్ సినిమాలు చూసే ప్రేక్షకుల పర్సంటేజ్ బాగా పెరిగింది. సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. టైటిల్ కు తగట్టుగానే సినిమా కూడా చాలా ఉత్కఠంగా సాగుతుందని తెలిసింది. దర్శకుడు కార్తిక్ కు , హీరో ఉదయ్ శంకర్ కి మంచి విజయం ఈ సినిమా అందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా నుండి కాన్సెప్ట్ ఓరియంటెండ్ స్క్రిప్ట్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ‘క్షణ క్షణం’ తప్పకుండా మా టీంకి పెద్ద సక్సెస్ అందిస్తుందనే నమ్మకం ఉంది. డార్క్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. పాటలు బాగా వచ్చాయి” అన్నారు.

Related posts