telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సంగం డెయిరీ కేసులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు

ap high court

ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా విచారణపై స్టే ఇవ్వాలని కోరారు ధూళిపాళ్ల న్యాయవాదులు. ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ చేయాలని పరిస్థితి ఉందన్న సీఐడీ.. కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టునే విచారణ చేయాలని ఆదేశించింది హైకోర్టు. సంఘం డైరీలో విలువైన సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని కోర్టుకి తెలిపిన పిటిషనర్లు.. ప్రతి రోజూ విచారణను పంచనామా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా.. సంఘం డైరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవో కొట్టేసింది ఏపీ హైకోర్టు. సంఘం డైరీ సంస్థ ఆస్తులను అమ్మాలన్నా, కొనాలన్నా కోర్టు ద్వారా చేయాలన్న హైకోర్టు.. ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు సంఘం డైరీ డైరెక్టర్లు. వారి పిటిషన్లను విచారించిన హై కోర్టు.. సంఘం డైరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవో కొట్టేసింది.

Related posts