telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ ఆక్రమిత కశ్మీర్ పై … ఆ దేశంతో చర్చలు జరుగుతాయి.. : వెంకయ్యనాయుడు

Venkaiah-Naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ అంశంపైనే ఆ దేశంతో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన సర్పంచులు, పంచాయతీ సభ్యుల బృందం దిల్లీలో ఆయనను కలసింది. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడుతూ జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 74శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు.

స్థానిక సంస్థలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో 370వ అధికరణాన్ని రద్దు చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. స్థానిక సంస్థలను కూడా బలోపేతం చేసే వీలు కలిగిందన్నారు.

Related posts