telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ

మంత్రిగారి రాస‌లీల‌లు..!

అవంతి రాస‌లీల‌ల పేరు ఆడియో వైర‌ల్‌..
అదంతా క‌ల్పితాలు అంటున్న మంత్రి..
ఆడియో టేపు మంత్రి అవంతిదే అంటున్న సోష‌ల్ మీడియా..

మొన్న పృథ్వీ రాజ్, నిన్న అంబటి రాంబాబు, ఈ రోజు ముత్తం శెట్టి శ్రీనివాస రావు.. ఇలా వైకాపా పార్టీ నాయకుల రాసలీలల ఆడియో లీకులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం శృష్టిస్తున్నాయి. వరుసగా మహిళలతో మాట్లాడుతున్న రాజాకీయ నాయకుల ఆడియో టేపుల లీకులు ఏపీలో సంచలనం శృష్టిస్తున్నాయి.

మొన్న పృథ్వీ రాజ్ ఆడియో, ఇటీవల ఓ మహిళతో మాట్లాడుతూ మంత్రి అంబటి రాంబాబు అడ్డంగా బుక్కవగా, ఇపుడు మంత్రి అవంతి శ్రీనివాసరావు వంతు రానే వచ్చింది. ఇపుడు సోషల్ మీడియోలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల పేరిట ఒక ఆడియో టేప్ చక్కర్లు కొడుతుంది.

ఒక మహిళతో సరసాలాడుతున్నట్టు ఉన్న ఆడియోలో ఉంది వైసీపి పార్టీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు అని సోషల్ మీడియాలో ప్రాచారం జరుగురింది. “పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను… అన్ని రకాలుగా బాగుంటుంది… ఓ అరగంటలో పంపిస్తా.. నాతో.. ఓ అరగంట కూడా గడపలేవా..?? నీ మాటలకు చేతలకు చాలా తేడా ఉంది.. చెప్పిన మాట విను….” అంటూ మహిళతో సరసాలాడుతున్నట్టు ఉన్న ఈ ఆడియో టేప్ ముమ్మాటికి మంత్రి అవంతిదే అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది.

అయితే ఈ ఆడియో టేపు మంత్రి అవంతి ఎట్ట‌కేల‌కు స్పందించారు. మాటాల‌కు, చేత‌ల‌కు చాలా తేడా వుంది..ఎవరో తాత్కాలిక‌ ఆనందం కోసం క‌ల్పితాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, నాకు పెరుగుతున్న ఆద‌ర‌ణ చూసి ఓర్వ‌లేక‌పోతున్నార‌ని నా ఎదుగు ద‌ల‌కు చూడలేక నామీద బుర‌ద జ‌ల్లుతున్నార‌ని అవంతి చెప్పుకొచ్చారు.

కాగా మ‌హిళ‌తో మాట్లాడిని ఆడియో క్లిప్‌పై ఎంక్వేరీ చేయాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని చెప్పారు. చౌక‌బారు ఆరోప‌ణ‌ల‌తో ఇబ్బంది పేడుతున్న వారికి ప‌ట్టుకొని క‌ఠినంగా శిక్షాల‌ని పోలీసుల‌కు కోరిన‌ట్లు చెప్పారు.

 

Related posts