telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీస్ ఆఫీసర్ గా రాశి… పిక్ వైరల్

Rashi

ఒకప్పుడు హీరోయిన్‌గా రాశి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆమెను అప్పట్లో ఆరాధించేవారు కూడా. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేసిన రాశి.. నటిగా మంచి మంచి పాత్రలలో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. అయితే ఎప్పుడూ చీరకట్టులో నిండుగా కనిపించిన రాశి.. పెళ్లి తర్వాత బాగా లావుగా మారారు. లావుగా ఉన్నా చీరకట్టులో మాత్రం ఆమె కుందనపు బొమ్మాలానే కనిపించేవారు. అయితే ఈ లాక్‌డౌన్‌లో ఆమె తన దేహంపై శ్రద్ధపెట్టి చాలా వరకు బరువు తగ్గారు. ఆమె తాజా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాశి విజన్స్ అంటూ ఓ సీరియల్ షూటింగ్‌లో ఉన్న వీడియోను రాశి పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పోలీస్ ఆఫీసర్ పాత్రకి సంబంధించిన షూటింగ్‌లో ఆమె పాల్గొంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా రాశి లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts