telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

వామన్‌ రావు కేసులో మరో ట్విస్ట్.. రంగంలో విశాఖ గజ ఈతగాళ్లు

హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులను కాపుకాచి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా విచక్షణా రహితంగా దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే..  వామన్ రావు సతీమణి కారులోనే మృతి చెందగా, వామన్ రావును ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెందారు.  ఇది ఇలా ఉండగా…ఈ  కేసు నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. కుంటశీను, చిరంజీవి, అక్కపాక కుమార్, బిట్టు శీనులను కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. హత్య అనంతరం కత్తులను సుందిళ్ళ బ్యారేజీలో పడేసి మహారాష్ట్రకు నిందితులు కుంట శీను, చిరంజీవి, అక్కపాక కుమార్ పరారయ్యారు. సుందిళ్ళ బ్యారేజీలోని కత్తులను తీసేందుకు వైజాగ్ నుండి గజ ఈతగాళ్ళు చేరుకున్నారు. గజ ఈతగాళ్ళ సాయంతో కత్తులను బయటకు తీసేందుకు పోలీసుల కసరత్తు చేస్తున్నారు. సుందిళ్ళ బ్యారేజ్ లో పడేసిన కత్తుల కోసం ఇవాళ ఆపరేషన్ ప్రారంభించారు గజ ఈతగాళ్ళు. పడవల సాయంతో బ్యారేజీలోకి దిగి ముమ్మరంగా గాలిస్తున్నారు గజ ఈతగాళ్ళు. సుందిళ్ళ బ్యారేజీ 59 పిల్లర్ నెంబర్ వద్ద పడేసినట్లు పోలీసులకు నిందితులు తెలిపారు. అయితే.. పోలీసులకు కత్తుల వెలికితీత సవాల్ గా మారింది.

Related posts