telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రం ప్రకటనతో తెలుగు ప్రజల రక్తం మరుగుతోంది….

అరవై గ్రామాల ప్రజలు, 32 మంది బలిదానంతో స్టీల్ ప్లాంట్ వచ్చిందని…అలాంటిది కేంద్రం… రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేదని చెప్పడం దారుణమని మంత్రి ముత్తంశెట్టి శెట్టి శ్రీనివాసరావు అన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై మాట్లాడాలని నిలదీశారు. ఈ ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం ఇస్తుందని… అఖిల పక్షాలను ఢిల్లీ తీసుకుని వెళ్లి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. నిర్మల సీతారామన్ ప్రకటన తరువాత తెలుగు ప్రజల రక్తం మరుగుతోందని… సబ్బంహరి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏపీ భాగం కాదా? చంద్రబాబు కేంద్రాన్ని, మోడీని విమర్శించకుండా… విజయసాయిరెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించటం సరికాదన్నారు. మాకు లాలూచీ పడాల్సిన అవసరం లేదని.. గల్లీలో పోరాటం చేస్తాం.. ఢిల్లీలో చేస్తామని స్పష్టం చేశారు. నోటి కొచ్చినట్టు మాట్లాడుతూ.. కావాలని రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

Related posts