telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమానాలు బంద్‌

Indian navy flight

దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని తాజాగా ఏప్రిల్ 14 వరకు పొడిగించాలని డీజీసీఏ నిర్ణయించింది. అయితే ముందు నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం కార్గో విమానాలు మాత్రం త‌మ అనుమ‌తితో న‌డుస్తాయ‌ని డీజీసీఏ తెలిపింది.

దేశీయంగానూ విమాన సర్వీసులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ దేశీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కూడా పొడిగించేందుకు కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి భారత్ లో రెండో దశలో ఉన్నందున, దాన్ని అంతటితో ఆపేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.

Related posts