భాగమతి చిత్రం అనంతరం సుదీర్ఘ విరామం తీసుకున్న అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సైలెన్స్ అనే చిత్రం చేయడానికి అంగీకరించింది. తమిళం, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటించనుండగా, అంజలి, షాలినిపాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ సినిమా షూటింగు అమెరికాలో జరగనుంది. ఫిబ్రవరిలోనే సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని అనుకున్నారు. అయితే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అనుష్క వీసా విషయంలో జాప్యం జరిగింది.
దీంతో షెడ్యూల్ వాయిదా పడింది. తాజాగా అనుష్కకి వీసా రావడంతో, త్వరలో అమెరికా వెళ్లేందుకు ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేసుకుంటోందినటుడు మాధవన్‌కు జంటగా తొలిసారిగా నటించిన అనుష్క ఇప్పుడు ఆయనతో రెండో సారి జత కడుతుంది. ఈ చిత్రంలో అనుష్క క్యూట్ లుక్‌లో కనిపించనున్నారు. అనుష్క సైరా చిత్రంతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రంలోను ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.