telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ `అల్లుడు అదుర్స్` ఏప్రిల్ 30న

alludu-adurs

‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆ తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలతో పలకరించాడు బెల్లంకొండ. అందులో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘జయ జానకి నాయక’ సినిమా మాత్రం పర్వాలేదనిపించింది. రీసెంట్‌గా రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘రాక్షసుడు’ కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌కు మంచి పేరే తీసుకొచ్చింది. ప్రస్తుతం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న `అల్లుడు అదుర్స్` సినిమాలో నటిస్తున్నాడు సాయి శ్రీనివాస్. కామెడీ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. నభా నటేష్, అను ఇమ్మానుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, సోనూసూద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related posts