telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య కాదు హత్య… వైరల్ అవుతున్న పోస్ట్

Sushanth singh rajput

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్‌లోని బంధుప్రీతి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని చాలా మంది ఆరోపించారు. తాజాగా మరో కోణం బయటకు వచ్చింది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, సల్మాన్ ఖాన్, సూరజ్ పంచోలీ కలిసి అతణ్ని హత్య చేశారని ఓ వివాదాస్పద పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివాదాస్పద పోస్ట్ ప్రకారం.. నటుడు సూరజ్ పంచోలి వల్ల సుశాంత్ మేనేజర్ దిశ గర్భవతి అయిందట. ఆ విషయం తెలిసుకున్న సూరజ్.. దిశను చంపేశాడట. అయితే అప్పటికే ఆ విషయం సుశాంత్‌కు తెలిసిపోయిందట. కొన్ని ఆధారాలు సేకరించి మీడియా ముందు వెల్లడించాలనుకున్నాడట. దీంతో సల్మాన్ ఖాన్, మహేష్ భట్, కొన్ని అండర్‌వరల్డ్ శక్తుల సహాయంతో సుశాంత్‌ను సూరజ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడట. గతంలో హీరోయిన్ జియా ఖాన్‌ను కూడా సూరజ్ ఇలాగే చంపేశాడని, అప్పుడు కూడా సల్మాన్ సహాయంతోనే బయట పడ్డాడనేది ఈ కథనం సారాంశం. ఈ కథనాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్న పలువురు నెటిజన్లు దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts