మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధాని మోదీ పర్యటించారు.అల్లూరు సీతారామరాజు 30 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ చేశారు.
ఆ సభకు మోదీదో పాటు సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి రోజా తో పాటు సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
తాజాగా ఆ సభపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మెగా బ్రదర్ నాగబాబు వ్యంగ్యాస్త్రం సంధించారు. ”మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగిందని. ఆ సభలో అన్నయ్య చిరంజీవి మినహా అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహానటులందరికీ నా అభినందనలు ” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో నాగబాబు చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైసీపీ మంత్రి రోజా , ముఖ్యమంత్రి జగన్‌ను పరోక్షంగా ఎద్దేవా చేస్తూ నాగబాబు ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అన్నయ్య చిరంజీవి కూడా అదే సభలో వినయంగా కనిపించారు.. మరి ఆయనది అద్భుత నటన కాదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
రోజాపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు