telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మెగా అల్లుడి సినిమా నుండి గ్లిమ్ప్స్ విడుదల…

మెగా ఫ్యామిలీ నుండి సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు ఉన్నారు. అందులో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఒకరు. అయితే కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అతను నటిస్తున్న సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వరుసగా వస్తున్నాయి. తాజాగా  శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 3 ఫస్ట్ గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 సమర్పణలో ఈ సినిమా వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కళ్యాణ్ దేవ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 11న కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి చిన్న వీడియోను విడుదల చేశారు. హీరో కళ్యాణ్ దేవ్ గారి సతీమణి శ్రీజ సైతం ఈ వీడియోలో ఉండటం విశేషం. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఐ ఆండ్ర్యూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది.

Related posts