telugu navyamedia
సినిమా వార్తలు

కేజీఎఫ్ 2 ట్రైలర్​కు టైమ్​ ఫిక్స్​..

క‌న్నడ స్టార్​ హీరో యశ్​ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కేజీఎఫ్​ 2 .ఈ సినిమాను ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రయూనిట్‌.

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్​ 2’ ట్రైలర్​ను మార్చి 27న సాయంత్రం 6.40గంటలకు విడుదల చేస్తామని డేట్ ను రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం.

2018లో వ‌చ్చిన ‘కేజీఎఫ్’ తొలి భాగం దేశవ్యాప్తంగా విడుదలై, అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించింది. వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించి కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగిపోయేలా చేసిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది కేజీయఫ్ 2.

హోంబలే పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించిన “కేజీఎఫ్ : చాప్టర్ 2″లో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

Image

Related posts