telugu navyamedia
సినిమా వార్తలు

సాయిపల్లవి ‘గార్గి’ ట్రైలర్‌ అదిరిపోయింది ..

సాయి పల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా ‘గార్గి’ . గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాలి వెంకట్‌, శరవణన్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

ఇటీవల సాయి పల్లవి పుట్టినరోజు కానుకగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అలానే మేకింగ్ వీడియో కూడా వదిలారు. చాలా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోను కట్ చేశారు. తాజాగా ఈ రోజు (గురువారం) ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది.

Gargi Trailer: Sai Pallavi is up for justice in this emotional courtroom drama Tamil Movie, Music Reviews and Newsగార్గి తండ్రి ఓ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్తాడు. ఒక్క రోజులోనే తమ జీవితాలు తలకిందులైపోయాయని తల్లడిల్లిపోతుంది కథానాయిక. అతడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది సాయిపల్లవి. ఇందుకోసం కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంది.

ట్రైలర్ లో సాయిపల్లవి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నువ్వు టైమ్, రాత, విధి.. అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే.. నేను మగపిల్లాడిని కాదుగా, ఆడపిల్లను’ అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

Sai Pallavi's film Gargi gets a release date. Find out here! - Movies News

గార్గీ నువ్వు ఎవ‌రి కూతురివి, ఇలాంటి వాటికి భ‌య‌ప‌డ‌వ‌చ్చా.. ఒక్క నిముషం నాన్న‌ను త‌లుచుకో ధైర్యం అదే వ‌స్తుంది అంటూ వాళ్ళ నాన్న కూతురికి ధైర్యం చెబుతున్న‌ డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి.

Release date of Sai Pallavi's Gargi announced

2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తుండగా తెలుగులో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. రవిచంద్రన్‌ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్‌ జార్జి, గౌతమ్‌ రామచంద్రన్‌ నిర్మించారు. కోర్టు డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 15న విడుదల కాబోతోంది.

Related posts