telugu navyamedia
సినిమా వార్తలు

విద్యార్థినుల ముందు అస్య‌భ్య ప్ర‌వ‌ర్త‌న ..ప్రముఖ నటుడు అరెస్టు

ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్​ రవిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పాలక్కాడ్ లో ఇద్దరు విద్యార్థినుల ఎదుట శ్రీజిత్ రవి తన ప్రైవేట్ పార్ట్స్ ను ప్రదర్శించాడన్న ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. శ్రీజిత్ రవిపై కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో శ్రీజిత్ రవి తన కారులో మర్మాంగాన్ని చూపాడని పోలీసులు తెలిపారు .లైంగిక వేధింపుల కేసులో శ్రీజిత్ రవి అరెస్ట్ కావడం ఇది రెండోసారి.

గతంలో ఇదే రీతిలో పాఠశాల విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో శ్రీజిత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో చాలా రోజుల పాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్​పై విడుదలయ్యారు. పోలీసులు కావాలనే ఆ కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

తాజాగా మరోసారి ఆయనపై కేసు నమోదు కావడం మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్​టాపిక్​గా మారింది.మలయాళ సీనియర్ నటుడు టీజీ రవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రీజిత్ రవి.

2005లో ‘మయూఖం’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా విభిన్నమైన పాత్రలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘జో అండ్ జో’ సినిమాలో పోలీస్ ఆఫీసర్​గా నటించారు

Related posts