telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మామాఅల్లుళ్ల కెమిస్ట్రీతో అదరగొట్టేశారు : మహేష్ బాబు

Venky-Mama

బాబి దర్శకత్వంలో “విక్టరీ” వెంకటేష్, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కలిసి నటించిన చిత్రం “వెంకీ మామ”. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా పాజిటివ్ టాక్ దక్కించుకుని భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాను చూసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విటర్ ద్వారా ప్రశంసలు కురిపించాడు. మామాఅల్లుళ్ల కెమిస్ట్రీ అదిరిందని ట్వీట్ చేశాడు. “వెంకీ మామ ఒక మంచి ఎంటర్‌టైనర్. సినిమాలోని ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేశా. వెంకటేష్‌గారు, చైతన్య మామాఅల్లుళ్ల కెమిస్ట్రీతో అదరగొట్టేశారు. కుటుంబ విలువలు, కామెడీ, భావోద్వేగాలతో కూడిన పర్ఫెక్ట్ చిత్రం. చిత్రబృందం మొత్తానికి అభినందనలు” అని మహేష్ ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్‌కు చైతన్య రిప్లై ఇచ్చాడు. “ధన్యవాదాలు మహేష్. మీ మెసేజ్ మాకు చాలా విలువైనది. మీకు సినిమా నచ్చినందుకు సంతోషంగా ఉంది” అని ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్ పై రష్మిక కూడా స్పందించి మహేష్ బాబుకు ధన్యవాదాలు చెప్పింది.

Related posts