బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు లో రోజుకో రహస్యం బయటకు వస్తోంది. ఈ క్రమంలో సుశాంత్ మృతి కేసును సీబీఐకి అప్పిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ తాజాగా పలు షాకింగ్ విషయాలను వెల్లడించాడు. ”కేదార్‌నాథ్ మూవీ ప్రమోషన్ సమయానికి సుశాంత్- సారా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే సుశాంత్ తదుపరి చిత్రం సోన్‌చిరియా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో వెంటనే సుశాంత్‌తో సారా అలీఖాన్ బ్రేకప్ చేసుకుంది. ఆ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. సోన్‌చిరియా ఫ్లాప్ అవ్వడానికి బాలీవుడ్ మాఫియానే కారణం” అని శామ్యూల్ హోకిప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపాడు. సుశాంత్, సారా మధ్య లవ్ స్టోరీ నడిచినప్పుడు చిన్న పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ కనిపించేదని, కేవలం ప్రేమనే కాకుండా వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవం ఉండేదని, ఒకరిపై మరొకరు కవితలు చెప్పుకొననే వారని చెప్పాడు. అయితే సుశాంత్, సారా బ్రేకప్‌కి కారణం రియా చక్రవర్తే అని శామ్యూల్ చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సారా అలీఖాన్ తల్లి అమృతా సింగ్ కూడా వారి ప్రేమను వ్యతిరేకిస్తూ హెచ్చరించినట్లు శామ్యూల్ పేర్కొన్నాడు. దీంతో సుశాంత్ ఆత్మహత్య తర్వాత బయటకొస్తున్న ఈ విషయాలు జనాల్లో పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి.