telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కు .. తాళికట్టేసిన యువకుడు..

Arrest

ఓ యువకుడు మహిళా కానిస్టేబుల్ కు బలవంతంగా తాళి కట్టిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళా కానిస్టేబుల్ విధులను నిర్వహిస్తున్నారు. జగిత్యాలకు చెందిన చింతల కుమారస్వామి అనే యువకుడికి సదరు మహిళా కానిస్టేబుల్ వరుసకు మరదలు అవుతుంది.

విధుల్లో ఉన్న ఆమె వద్దకు చేరుకున్న కుమారస్వామి… ఆమెకు బలవంతంగా తాళి కట్టాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుపుతున్నామని ఈ సందర్భంగా ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు.

Related posts