telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రజలకు అందుబాటులో ఉండండి.. అదే నాకు ఇచ్చే బహుమతి

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం (జూలై 24) రోజున 46వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేటీఆర్ బర్తేడే వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేక్‌ కటింగ్‌ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, సర్వమత ప్రార్థనలు, చీరలు, పండ్లు, అన్నదానం చేసేందుకు మంత్రులు, టీఆర్ ఎష్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు, యువతకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు

అయితే ఈ ఏడాది తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని కేటీఆర్​… పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని.. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని ఆయన కోరారు. స్థానికంగానే ఉండి… ‘గిఫ్ట్ ఏ స్మైల్​’ కార్యక్రమంలో భాగంగా తమకు తోచిన సాయం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మరోమారు భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు, మూడు రోజులు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Related posts