హైదరాబాద్‌లో ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా ఆఖరిరోజు కార్యక్రమాలు సాగుతోంది.
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఇవాళ్టికి 13వ రోజుకు చేరింది. ఆదివారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు.120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల శ్రీరామానుజాచార్యుల స్వర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లోకార్పణం చేశారు.
ఈ నెల 2వ తేదీన ప్రారంభమయిన ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇక్కడ నిర్మించిన 108 ఆలయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలాదిమంది భక్తులు తరలివస్తుండడంతో శ్రీరామనగరం భక్త జన సంద్రంగా మారింది. ఈరోజు జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.