telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ఆశా కార్మికులకు ఐఫోన్లు…

మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ బిఆర్‌కె భవన్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆస్పత్రికి సకాలంలో రాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్నీ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో వైద్య సేవల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని కూడా సూచించింది. ఇందుకోసం ఆశా కార్మికులకు ఐఫోన్లు ఇవ్వాలని కమిటీ సూచించింది. ఆసుపత్రిలో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆస్పత్రిలోని వార్డులు, మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు శుభ్రంగా ఉంచాలని..కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆరోగ్య కార్యదర్శి రిజ్వి, కళాశాల ఆరోగ్య విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ కరుణకర్ష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts