telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు…

corona

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే…ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్ళీపెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,436 పాజిటివ్ కేసులు నమోదవగా..1,436 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. అలాగే 24 గంటల్లో 6 మంది కరోనా తో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,22,111 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,98,790 మంది కోలుకున్నారు.

తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 1271 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 88 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 89.5 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 22,050 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 41,043 టెస్ట్‌లు నిర్వహించారు.

Related posts