telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలోకి మిడతలు..బెంబేలెత్తుతున్న ప్రజలు

Locust telangana

గత నెలలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించిన మిడతల దండు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి మిడతలు ప్రవేశించాయి. పెద్దంపేట గోదావరి పరీవాహక ప్రాంతంలో చెట్లను నాశనం చేస్తున్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

మహారాష్ట్రలో ఉన్న మిడతలు దక్షిణ దిశలో ప్రయాణిస్తే తెలంగాణకు చేరుకుంటాయని నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈలోగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మిడతలు ప్రవేశించి ప్రజలను కలవరపెడుతున్నాయి.

Related posts