telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నువ్వు పెద్ద హీరోవా.. రేవంత్ పై వీహెచ్ ఫైర్

hanmanth rao congress

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. బయటి నుంచి వచ్చి పార్టీలో చేరిన వాళ్లు పార్టీ హైకమాండ్ పైనే వ్యాఖ్యలు చేస్తున్నారని  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలోకి వచ్చావు కాబట్టి కొన్నిరోజులు పనిచేసుకో అని హితవు పలికారు. లేకపోతే నేను చరిత్ర బయటికి తీయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సొంత నియోజకవర్గంలో ఒక్క మున్సిపాలిటీ గెలిపించని నువ్వు పెద్ద హీరోవా? అంటూ నిప్పులు చెరిగారు.

సోనియా వయసైపోయిందని, రాహుల్ గాంధీ పార్టీని పట్టించుకోవడంలేదని ప్రచారం చేస్తున్నారని, ఏంటి ధోరణి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డిలను ఏనాడు కాంగ్రెస్ పార్టీ కాబోయే ముఖ్యమంత్రులు అంటూ ముందే చెప్పలేదని అన్నారు. కానీ ఇప్పుడు కొందరు కాబోయే ముఖ్యమంత్రులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

Related posts