telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నవంబర్ నెలలోనే మున్సిపల్ ఎన్నికలు: కేసీఆర్

KCR cm telangana

నవంబర్‌ లోపే మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు నూతన చట్టాలు తెచ్చిందని తెలిపారు. గ్రామపంచాయతీ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చామని అన్నారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని తెలిపారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.1,030 కోట్లు బడ్జెట్‌లో పెట్టామని, 141 మున్సిపాలిటీలకు రూ.2,061 కోట్లను విడుదల చేస్తామన్నారు. పంచాయతీలకు రూ.339 కోట్లు విడుదల చేస్తున్నామని, అభివృద్ధి అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదని, పట్టణ ప్రగతికి కూడా ప్రణాళిక తీసుకొస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీవారు మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.

Related posts