telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీ మహిళకు అరుదైన గౌరవం కల్పించిన టిసిసిఐ

గిరిజన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ – (టిసిసిఐ) ను పారిశ్రామికవేత్త సుధాకర్ ధరవత్ 2012 లో స్థాపించారు. టిక్కీ భారతదేశంలో అతిపెద్ద గిరిజన వ్యాపార సంస్థ. ఇది ప్రభుత్వేతర సంస్థగా వర్గీకరించబడింది మరియు హైదరాబాద్ లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదు చేయబడింది. దీని అధీకృత వాటా మూలధనం రూ. 100,000 మరియు దాని పెయిడ్ అప్ క్యాపిటల్ రూ. 100,000. ఇది మానవ ఆరోగ్య కార్యకలాపాలలో ఉంటుంది. అయితే తాజాగా ఏపీలోని కృష్ణ జిల్లాకు చెందిన మల్లి ఆది లక్ష్మీకి గిరిజన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ – (టిసిసిఐ) అరుదైన గౌరవం కల్పించింది. మల్లి ఆది లక్ష్మీని ఏపీ టిసిసిఐ అధ్యక్షురాలిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టిసిసిఐ. ఈ మేరకు ఆమెకు ఓ అపాయింట్ మెంట్ లెటర్ ను కూడా విడుదల చేసింది టిసిసిఐ. “అనేకసార్లు చర్చలు జరిపి ఏపీ టిసిసిఐ అధ్యక్షురాలిగా మల్లి ఆది లక్ష్మీని నియమిస్తున్నట్లు టిసిసిఐ ప్రకటించింది. గిరిజన వ్యవస్థాపకులను శక్తివంతం చేయడానికి మరియు టిసిసిఐ యొక్క వృద్ధికి సమయాన్ని అందించడానికి ఆదిలక్ష్మీ సేవలు ఎంతో అవసరమని పేర్కొంది టిసిసిఐ.

Related posts