భారత బౌలర్ సంచలనం…వన్డేల్లో వరల్డ్ నెంబర్1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు ర్యాంకింగ్‌లో టాప్ 10లోకి ప్రవేశించాడు. తాజాగా, ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 774 రేటింగ్ పాయింట్లతో బుమ్రా ఏడవ స్థానంలో నిలిచాడు. బుమ్రా టెస్టుల్లో టాప్-10లోకి రావడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన బుమ్రా తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ 10 లోకి దూసుకొచ్చాడు.
ఇండియా బౌలర్లలో బుమ్రాతో పాటు టాప్ టెన్‌లో జడేజా(10) ఉన్నాడు. మొదటి స్థానంలో ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
నేను కూడా దానికి బాధితురాలినే… : కస్తూరి